News August 1, 2024

రెండో మ్యాచ్‌లో పాలమూరు టీం సంచలన విజయం

image

HCA ఏ1 డివిజన్ 3డే లీగ్ టోర్నీ రెండో
మ్యాచ్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జట్టు బుల్స్ క్లబ్(HYD) జట్టుపై 8 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. రెండో త్రీడే విజయం సాధించిన జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉమ్మడి జిల్లా అధికారులు, నేతలు అభినందించారు.
✒తొలి ఈనింగ్స్ – HYD-96/10(37.4ov),
MBNR-190/10(76.5ov)
✒సెకండ్ ఈనింగ్స్ – HYD-123/10(29.1ov),
MBNR-30/2(8.6ov)
>>CONGRATULATIONS❤

Similar News

News February 20, 2026

MBNR: AIU వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పీయూ వీసీ

image

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ 2025-26 నిర్వహించారు. “Creating AI & Quantum enabled Higher Educational Institutions” అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పీయూ వీసీ జిఎన్.శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ కూడా పాల్గొన్నారు.

News February 20, 2026

MBNR: ఈనెల 21న బడుల్లో పేరెంట్స్ మీటింగ్: డీఈవో

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ నెల 21న పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆదేశించారు. పరీక్షల నేపథ్యంలో పిల్లలకు ఇంటి వద్ద సహాయం ఎలా అందించాలన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 10వ తరగతి, అలాగే 2వ, 3వ తరగతి ఎఫ్‌ఎల్‌ఎన్/ ఎఫ్‌ఎల్‌ఎస్ పరీక్షల సిద్ధతపై దృష్టి పెట్టాలని డీఈవో సూచించారు.

News February 19, 2026

MBNR: ముస్లిం ఉద్యోగులకు రంజాన్ వేళల్లో సడలింపు

image

రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని PU విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనివేళల్లో సడలింపు ఇస్తున్నట్లు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగులందరూ సాయంత్రం ప్రార్థన (నమాజ్) చేసుకోవడానికి వీలుగా ప్రతిరోజూ గంట ముందుగా (సా. 04:00 గంటలకు) యూనివర్సిటీ నుంచి వెళ్లేందుకు అనుమతి మంజూరు చేశామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.