News December 7, 2025
రెండో విడత ఎన్నికలు.. 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 23 సర్పంచ్, 306 వార్డులు స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. కామేపల్లి S-6 W-67, ఖమ్మం రూరల్ S-2 W-22, కూసుమంచి S-6 W-87, ముదిగొండ S-1 W-27, నేలకొండపల్లి S-3 W-50, తిరుమలాయపాలెం S-5 W-53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా 6 మండలాల్లో మిగిలిన 160 సర్పంచ్, 1380 వార్డు స్థానాలకు ఈనెల 14న ఎన్నిక జరగనుంది.
Similar News
News March 7, 2026
అంధ విద్యార్థిని కృతజ్ఞతలు.. ఖమ్మం కలెక్టర్ భావోద్వేగం

ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాలను శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి, అధికారులను పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థిని భవాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయగా కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ చిన్నారిని ఆశీర్వదించి చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.
News March 6, 2026
అంధుల పాఠశాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాల పనులను శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు. భవన నాణ్యత, తరగతి గదులు, టాయిలెట్స్, ప్రవేశ మార్గాలు, భద్రతా సదుపాయాలను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంధ విద్యార్థులకు బ్రెయిల్ లిటరసీ డివైస్, ఆడియో పాఠాల సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
News March 6, 2026
వీధి కుక్కల బెడదకు ప్రత్యేక కార్యక్రమాలు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో 10 ప్రత్యేక అంశాలతో 99 రోజుల కార్యాచరణ చేపట్టడం జరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయి, ఏప్రిల్ 16న మండల స్థాయి, మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అటు ప్రధాన సమస్య అయిన వీధి కుక్కల బెడద తొలగించేందుకు MAR 14న ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.


