News October 25, 2025

రెగ్యులర్ SSC విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ఆఫర్

image

ఏపీ ఓపెన్ స్కూల్ 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రవేశించేందుకు ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి అవకాశం కల్పిస్తూ ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది. ఓల్డ్ సిలబస్‌లో పదో తరగతి ఫెయిలైన వారు రూ.300లు చెల్లించి ఈనెల 31 లోపు అడ్మిషన్స్ పొందాలని డీఈఓ నారాయణ తెలిపారు. జిల్లాలో రెగ్యులర్ SSC ఫెయిల్ అయిన వారు 1,130 మంది ఉన్నారన్నారు. వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News October 25, 2025

తణుకు డిపో నుంచి ప్రత్యేక బస్సులు: DM

image

కార్తీక మాసం సందర్భంగా తణుకు డిపో నుంచి రాష్ట్రంలోని పలు పుణ్య క్షేత్రాలు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తణుకు RTC డిపో మేనేజర్‌ సప్పా గిరిధర్‌ కుమార్‌ శుక్రవారం తెలిపారు. పంచారామాలకు అక్టోబర్‌ 26, నవంబర్‌ 2, 9, 16 తేదీలలో రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. కార్తీక సోమవారం దర్శనాల అనంతరం తిరిగి తణుకు చేరుతాయని చెప్పారు.

News October 25, 2025

డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం

image

డిగ్రీ ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లు డీఎన్ఆర్‌ డిగ్రీ ప్రిన్సిపల్ జి.మోజెస్ శుక్రవారం తెలిపారు. 2001-20 మధ్య కాలంలో డిగ్రీ ఫెయిలైన అభ్యర్థులకు యూనివర్సిటీ మరో అవకాశం కల్పించిందన్నారు. పరీక్ష ఫీజు కట్టి, డిగ్రీ పూర్తి చేయడానికి యూనివర్సిటీ అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 24, 2025

నర్సాపురంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

నర్సాపురంలోని 29వ వార్డులోని స్థానిక కళాశాల సమీపంలో నిడదవోలు నుంచి మొగల్తూరు వెళ్లే పంట కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న నరసాపురం ఎస్సై ఎస్ఎన్ ముత్యాలరావు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతదేహానికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే నరసాపురం పట్టణ పోలీసులను సంప్రదించాలన్నారు.