News January 9, 2026
రెట్రో లుక్.. శ్రీలీల లేటెస్ట్ ఫొటోలు వైరల్

శ్రీలీల లేటెస్ట్ రెట్రో లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. శివకార్తికేయన్ ‘పరాశక్తి’లో నటించిన ఆమె ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తమిళనాడులో నిన్న జరిగిన ఈవెంట్‌లో ఆమె బ్లాక్ శారీ, జడలో గులాబీ పువ్వుతో కనిపించారు. దీంతో శ్రీలీల అలనాటి హీరోయిన్లను తలపిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పరాశక్తి రేపు విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా రాకపోవడంతో గందరగోళం నెలకొంది.
Similar News
News February 14, 2026
ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

1898: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం
1921: ఆంధ్రప్రదేశ్ రెండో సీఎం దామోదరం సంజీవయ్య జననం
1952: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం
1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం(ఫొటోలో)
1984: నటుడు సి.హెచ్. నారాయణరావు మరణం
2019: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం
☛ ప్రేమికుల దినోత్సవం
News February 14, 2026
విజయ్ ర్యాలీలో కార్యకర్త మృతి.. అన్నాడీఎంకే సెటైర్

టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఎన్నికల ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. సేలంలో సభ జరుగుతున్న సమయంలో గుండెపోటుతో ఓ కార్యకర్త కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై అన్నాడీఎంకే నేత సత్యన్ వ్యంగ్యంగా స్పందించారు. టీవీకే ర్యాలీకి వెళ్తే శవపేటిక పట్టుకెళ్లాలని ట్వీట్ చేశారు. అంతకుముందు కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే.