News August 14, 2024

రెడ్ బుక్‌పై నారా లోకేశ్ స్పందన

image

రెడ్ బుక్‌పై లోకేశ్ స్పందించారు. ‘ఫేకు జగన్.. నాది రెడ్ బుక్ మాత్రమే కాదు ఓపెన్ బుక్ కూడా! నీలాగా నాకు క్విడ్ ప్రో కో, మనీ లాండరింగ్, CBI కేసులు లేవు. విదేశాలకు వెళ్లాలంటే నీ మాదిరిగా కోర్టు అనుమతులు నాకు అవసరం లేదు. మంత్రిగా ప్రభుత్వాల అనుమతితోనే వెళ్ళాను. జనాలు కొట్టిన షాట్ నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది. చిల్ బ్రో! సరే కానీ బాబాయ్‌ను లేపేసింది ఎవరో చెప్పే దమ్ముందా జగన్?’ అంటూ ట్వీట్ చేశారు.

Similar News

News September 30, 2024

మంగళగిరి: నేడు ప్రయోగాత్మకంగా నైపుణ్య గణన

image

మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న నైపుణ్య గణనను నైపుణ్యాభివృద్ధి సంస్థ సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. ఈ మేరకు సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత ఈ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఒక్కో గ్రామవార్డు సచివాలయం పరిధిలో 6గురు ఉద్యోగులు పనిచేస్తారని, వారు ఇంటింటికీ వెళ్లి 25 రకాల ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించి ట్యాబ్లో నమోదు చేస్తారు.

News September 30, 2024

గుంటూరులో యువకుడిపై కత్తితో దాడి

image

గుంటూరులో ఆదివారం రాత్రి ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. RTCకాలనీకి చెందిన ఖాసీం మందులు కొనడానికి రాత్రి రామిరెడ్డి తోటలోని ఓ మెడికల్ షాప్‌కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి మద్యం తాగి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఖాసీంతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఖాసీం దాడి చేశాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం GGHకు తరలించారు.

News September 30, 2024

ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల

image

మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం తెనాలి రామలింగేశ్వరపేటలోని జనసేన నాయకులు హరిదాసు గౌరీ శంకర్ స్వగృహంలో 8,9,10,11,12 ,13 వార్డులలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వార్డులలో తిరిగి ప్రజల వద్ద నుంచి అడిగి సమస్యలు తెలుసుకొని వారి సమస్య తీర్చే విధంగా కృషి చేస్తానని ఈ మేరకు మంత్రి హామీ ఇచ్చారు.