News February 2, 2026
రెబల్‌గా పోటీ చేస్తే 15 ఏళ్లపాటు సస్పెన్షన్: రాంచందర్ రావు

TG: మున్సి‘పోల్స్’లో పార్టీ B ఫారం పొందిన వారే పోటీలో ఉండాలని, పార్టీ ఇతర నేతలు బరి నుంచి తప్పుకోవాలని TBJP చీఫ్ రాంచందర్ రావు సూచించారు. పోటీలో కొనసాగే రెబల్స్‌ను 15 ఏళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అనేక సర్వే నివేదికల ఆధారంగా గెలిచే వారినే అభ్యర్థులుగా పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. టికెట్లు రాని వారికి పార్టీ పరంగా పదవులు ఇస్తామని వివరించారు.
Similar News
News February 21, 2026
రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

TG: గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం రేపు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGసెట్) జరగనుంది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 492 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. 11AM నుంచి 1PM వరకు ఎగ్జామ్ జరుగుతుందని చెప్పారు. కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని, పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.
News February 21, 2026
ALERT: మూడ్రోజులు వర్షాలు

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి 3 రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. వరి ప్రారంభ దశలో, మొక్కజొన్న కంకి దశలో ఉన్నాయి. దీంతో వర్షాల వల్ల నష్టం కలిగే ఆస్కారం ఉంది. రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 21, 2026
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రపై నాసా సంచలన రిపోర్టు!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ <<15733376>>అనివార్య కారణాలతో<<>> కొన్ని నెలలు స్పేస్‌లోనే ఉండిపోవడం తెలిసిందే. దీనిపై నాసా సంచలన రిపోర్టు రిలీజ్ చేసింది. స్టార్ లైనర్ వ్యోమనౌక తీవ్ర సాంకేతిక వైఫల్యాలకు లోనైందని తెలిపింది. అది ప్రాణాంతక వైఫల్యమని పేర్కొంటూ టైప్-ఏ ప్రమాదంగా వర్గీకరించింది. భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను పక్కనపెట్టి ప్రయోగాన్ని చేపట్టేందుకు నాసా మేనేజర్లపై ఒత్తిడి తెచ్చినట్లుగా గుర్తించింది.


