News August 15, 2025
రెబ్బెన: ఈనెల 23 నుంచి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు

తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈనెల 23 నుంచి 24 వరకు రెబ్బెన మండలం గోలేటి గ్రామంలోని సింగరేణి గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16న గోలేటిలోని సింగరేణి గ్రౌండ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 9381662413లో సంప్రదించాలన్నారు.
Similar News
News August 16, 2025
పెద్దపల్లి: ‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి’

PDPLలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా కింద 1,51,507 మంది రైతుల ఖాతాల్లో ₹161.02 కోట్లు జమ చేశామని తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా మహిళలకు ₹155.80 కోట్లు ఆదా అయిందన్నారు. గృహ జ్యోతి, ₹500 గ్యాస్ సిలిండర్, నూతన రేషన్ కార్డులు వంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
News August 16, 2025
ఎల్లారెడ్డిపేటలో వృద్ధురాలితో జెండా ఎగురవేత

ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ సభ్యులు 79వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చిన 1947లో జన్మించిన ముత్యాల చంద్రవ్వ(79)తో జాతీయజెండాను ఎగురవేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుంపెటి గౌరీశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ వృద్ధురాలు ఎంతో ఆనందం వ్యక్తంచేశారు. ఈ అవకాశం కల్పించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వినూత్న ఆలోచన స్థానికుల ప్రశంసలు అందుకుంది.
News August 15, 2025
ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయం: ఆది శ్రీనివాస్

ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకతతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం అనే జోడు గుర్రాలపై సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు.