News April 3, 2025

రెవెన్యూ అధికారుల పనితీరే ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికం: కలెక్టర్

image

రెవెన్యూ అధికారుల పనితీరే ప్రభుత్వ పనితీరుకు ప్రామాణికమని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్ చామకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాయచోటి పట్టణంలో ఆర్డీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు, మండల సర్వేయర్లు, ఆర్ఎస్డీటీలు, వీఆర్‌వో, వీఆర్ఏలతో రెవెన్యూ అధికారుల సదస్సు నిర్వహించారు. రెవెన్యూ, సర్వే శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

Similar News

News September 13, 2025

GWL: నడిగడ్డ మావోయిస్ట్ పోతుల సుజాత లొంగుబాటు

image

గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడుకు చెందిన <>మోస్ట్ వాంటెడ్<<>> మావోయిస్ట్ పోతుల కల్పన @ సుజాత హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. చత్తీస్‌గఢ్ సౌత్ జోన్ బ్యూరో ఇన్‌ఛార్జ్ ఆమె కొనసాగారు. 104 కేసుల్లో నిందితురాలుగా ఉన్న సుజాతపై రూ.1 కోటి రివార్డు ఉంది. అనారోగ్యం కారణంగా ఆమె జనజీవన స్రవంతిలో కలిశారు. ప్రభుత్వం తరఫున ఆమెకు రూ. 25 లక్షలు అందజేశారు. ఈ విషయం నడిగడ్డలో హాట్ టాపిక్‌గా మారింది.

News September 13, 2025

భోగాపురం దాదాపు పూర్తయినట్లే: కేంద్ర మంత్రి రామ్మోహన్

image

AP: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 86 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వర్షాలు కురుస్తున్నా GMR సంస్థ పనులు ఆపడం లేదన్నారు. విజయనగరంలో విమానాశ్రయ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ‘వచ్చే ఏప్రిల్‌లోగా వైజాగ్ నుంచి రోడ్డు కనెక్టివిటీ పనులు పూర్తి చేస్తాం. ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నాం. బీచ్ కారిడార్ కోసం ఇప్పటికే DPR సిద్ధం చేశాం’ అని వివరించారు.

News September 13, 2025

శ్రీ సత్యసాయి జిల్లా SPగా సతీశ్ కుమార్

image

శ్రీ సత్యసాయి జిల్లాకు నూతన SPగా సతీశ్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఇక్కడ పనిచేసిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నను అనంతపురం పీటీసీకి బదిలీ చేశారు. ఈమె స్థానంలో సతీశ్ కుమార్‌ను నియమించారు. త్వరలోనే నూతన SP బాధ్యతలు స్వీకరించనున్నారు.