News December 26, 2025
రెవెన్యూ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్‌గా నాగభూషణం

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ యూనిట్ రెవెన్యూ అసోసియేషన్ 2025-2028 ఎన్నికలు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ అధికారి నాగభూషణం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా శ్రావణి, సెక్రటరీగా వంశీకృష్ణ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి కలెక్టర్ నిశాంత్ కుమార్, జేసీ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్వో మధుసూదనరావు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 2, 2026
ఈ ఫ్రూట్స్‌తో క్యాన్సర్ దూరం

క్యాన్సర్ బారిన పడకుండా ఉండటానికి ఆహారంలో కొన్నిమార్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మామిడి, నేరేడు, ఉసిరి, మారేడు, పనస, వాక్కాయలు వంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వీటితో పాటు కోకుమ్, మంకీ జాక్ ఫ్రూట్ వంటివి తినడం కూడా మంచిదని సూచిస్తున్నారు.
News January 2, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 2, 2026
కర్నూలు: ఉద్యోగ బెంగతో గుండెపోటుతో యువతి మృతి

7 ఏళ్ల నుంచి డీఎస్సీకి సిద్ధమవుతూ ఉద్యోగం రాలేదనే బెంగతో గుండెపోటుకు గురై ఆదిలక్ష్మి(27) మృతిచెందిన విషాద ఘటన గోనెగండ్లలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీరాములు-రంగమ్మ (వ్యవసాయ కూలీలు) దంపతుల కుమార్తె ఆదిలక్ష్మి ఉద్యోగం రాలేదని ఆవేదన చెందుతూ ఉండేది. దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. ఆదిలక్ష్మి మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.


