News February 25, 2026

రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: పొంగులేటి

image

రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న MRO, RDO కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో 60 MRO, 5 RDO కార్యాలయాలకు, రెండో దశలో శిథిలావస్థలో ఉన్న 170 కార్యాలయాలకు ఆధునిక భవనాలు నిర్మిస్తామన్నారు. ప్రజలకు పారదర్శకమైన, గౌరవప్రదమైన సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 26, 2026

పోలవరం: ఆవులపై దాడి చేసిన పెద్దపులి?

image

పోలవరం జిల్లాలో పులి సంచారం కలవర పెడుతోంది. రోజూ ఏదొక ప్రాంతంలో ప్రజలకు పులి తారస పడడంతో బెంబేలెత్తిపోతున్నారు. గురువారం తెల్లవారుజామున రంపచోడవరం మండలంలోని పెద్దకొండ గ్రామంలో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

News February 26, 2026

BREAKING: మెదక్ కలెక్టర్ బదిలీ

image

మెదక్‌ కలెక్టర్ రాహుల్ రాజ్ బదిలీ అయ్యారు. సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ రాజ్ 2024 మార్చి 6న ఆదిలాబాద్ నుంచి మెదక్ కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. మెదక్ కలెక్టర్‌గా రంగారెడ్డి (లోకల్ బాడీస్) అదనపు కలెక్టర్ 2019 బ్యాచ్‌కు చెందిన ప్రతీమ సింగ్ IAS నియమితులయ్యారు.

News February 26, 2026

BREAKING: భువనగిరి కలెక్టర్ బదిలీ

image

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. భువనగిరి కలెక్టర్ హనుమంతరావు బదిలీ అయ్యారు. ప్రభుత్వం ఆయనను దేవదాయ శాఖ డైరెక్టర్‌గా నియమించింది. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారిగానూ అపాయింట్ అయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వహించిన హరీష్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.