News January 5, 2026

రెవెన్యూ క్లినిక్‌లను సమర్ధంగా నిర్వహించాలి: బాపట్ల కలెక్టర్

image

రెవెన్యూ క్లినిక్‌లు సమర్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించామని కలెక్టర్ ప్రకటించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News January 10, 2026

పట్టిసీమలో కోడిపందేల బరులు ధ్వంసం

image

సంక్రాంతి పండుగ వేళ కోడిపందేలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం నిఘా పెంచింది. శనివారం ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో పట్టిసీమలో కోడిపందేల బరులను ధ్వంసం చేశారు. పండుగ ముసుగులో జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు అతిక్రమించకూడదని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు.

News January 10, 2026

నన్ను ఎంపిక చేయకపోవడాన్ని స్వాగతిస్తున్నా: గిల్

image

T20 WCకు తనను ఎంపిక చేయకపోవడంపై భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ గిల్ తొలిసారి స్పందించారు. సెలక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే WC జట్టుకు విషెస్ తెలిపారు. దేశం తరఫున ఆడుతున్న ప్రతి ప్లేయర్ తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారని, అయితే జట్టును ఎంపిక చేసే నిర్ణయం సెలక్టర్లదే అన్నారు. తాను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉన్నానని, తన డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.

News January 10, 2026

బడ్ చిప్ విధానం అంటే ఏమిటి?(1/2)

image

ఈ పద్ధతిలో చెరకు గడల నుంచి అర్ధ చంద్రాకారపు కన్నులను వేరు చేసి పెంచుతారు. చెరకు గడల్లో కుళ్లిన, వేర్లు వచ్చిన చెరకు కన్నులను విత్తన శుద్ధి చేసుకొని ట్రేలలో అమర్చుకోవాలి. ఈ పద్ధతిలో మూడు కళ్ల ముచ్చెలకు బదులుగా చెరకు కన్నులను మాత్రమే యంత్రం సహాయంతో వేరు చేసి విత్తనంగా వాడతారు. ప్లాస్టిక్ ట్రేలలో గుంతలను 1/3 వంతు వరకు కోకోవిట్‌తో నింపి కన్నులను పైకి ఉండేటట్లు వాలుగా ఉంచాలి.