News November 6, 2025
రెవెన్యూ డివిజన్‌గా నక్కపల్లి?

అనకాపల్లి జిల్లాలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు కానుంది. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని యలమంచిలి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, కోటవురట్ల, నక్కపల్లి మండలాలతో ఈ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం.
Similar News
News November 6, 2025
పీయూకి నేడు మందకృష్ణ మాదిగ రాక

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయిపై దాడులకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమం ఈనెల 17న నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ సమావేశంలో ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.
News November 6, 2025
ఖమ్మం: మాయమై పోతున్నడమ్మా.. మనిషన్న వాడు..!

మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. క్షణికావేశంలో, డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇటీవల తిరుమలాయపాలెం(M)నికి చెందిన ఒక వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లినే గొడ్డలితో నరికి హత్య చేశాడు. సత్తుపల్లిలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భార్యని ఓ వ్యక్తి హతమార్చాడు. ఖమ్మం(R)లో సోదరుల మధ్య పంచాయితీలో తమ్ముడిని అన్న హత్య చేశాడు. చింతకాని(M)లో వివాహేతర సంబంధంతో ఓ భార్య భర్తను చంపింది.
News November 6, 2025
నెల్లూరు యువకుడిని మోసం చేసిన యువతులు

నెల్లూరు సిటీకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా పూర్వ, లావణ్య పరిచయమయ్యారు. పూర్వ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.2లక్షలు పెట్టించింది. లావణ్య సైతం ట్రేడింగ్‌లో పలుదఫాలుగా రూ.10లక్షలు ఇన్వెస్ట్ చేయించింది. ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవడానికి రూ.54వేలు కట్టాలని లావణ్య కోరింది. మోసపోయానని గ్రహించిన యువకుడు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


