News February 21, 2025
రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్

మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. తహశీల్దార్ యాదిరెడ్డి రికార్డుల వివరాలను అదనపు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ రికార్డ్ రూమ్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈడీఎం శ్రవణ్, డిప్యూటీ తహశీల్దార్ సంయుక్త, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 22, 2025
విశాఖ: షికారుకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య

అనకాపల్లి గవరపాలెం సాగిదుర్గరాజు వీధిలో ఈనెల 19న ఆత్మహత్యకు ప్రయత్నించిన మంగారపు జ్యోతి(29) చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త షేక్ అబ్దుల్ ఘనితో కలిసి ఆమె తన పుట్టింటికి వెళ్లింది. 19న తనను బయటకు తీసుకెళ్లాలని భార్య కోరింది. ఇప్పుడు బయటకు ఎందుకని ఆమె తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురై మేడపైకి వెళ్లి ఉరేసుకుంది. వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.
News February 22, 2025
కేంద్ర మంత్రికి విరిగిన కుర్చీ.. ఎయిర్ ఇండియాపై ఆగ్రహం

ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తనకు విమానంలో విరిగిన కుర్చీ కేటాయించారని మండిపడ్డారు. డబ్బు తీసుకుని ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నారని, ఇది వారిని మోసం చేయడమేనని దుయ్యబట్టారు. టాటా టేకోవర్ తర్వాత కూడా సంస్థ తీరు మారలేదన్నారు. దీంతో ఎయిర్ ఇండియా క్షమాపణ కోరింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంది.
News February 22, 2025
తానూర్: ఉరేసుకొని గర్భిణీ ఆత్మహత్య

మనస్తాపం చెంది గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం తానూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బోల్సా గ్రామానికి చెందిన 3నెలల గర్భిణీ నవనీత(22)ను భర్త రాకేశ్ అక్క ఇంట్లోని శుభకార్యానికి తీసుకెళ్లలేదు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తండ్రి బక్కన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.