News April 17, 2025
రెవెన్యూ సదస్సులకు చర్యలు: ములుగు కలెక్టర్

భూభారతి కోసం ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. మే 1 నుంచి 31 వరకు పరిశీలన చేసి, జూన్ 2వ తేదీన పట్టాలు అందజేయడం జరుగుతుందన్నారు. మిగతా మండల కేంద్రాల్లో భూముల వివరాలు పూర్తిగా తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, ఖజానా కార్యాలయంలో పొందుపరచడం జరుగుతుందన్నారు.
Similar News
News December 17, 2025
మీరు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారుగా: కాంగ్రెస్ MLA

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నట్లు వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ‘ఫిరాయింపులపై <<18595871>>BRS<<>> మాట్లాడటం విడ్డూరంగా ఉంది. గతంలో మీరు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. తలసాని, సబితలకు మంత్రి పదవులూ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. తీర్పు నచ్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చు’ అని వ్యాఖ్యానించారు.
News December 17, 2025
బాపట్లలో పొగాకు గోడౌన్‌ను పరిశీలించిన ఏపీ మార్కెట్ ఛైర్మన్

ఏపీ మార్కెట్ ఛైర్మన్ కర్రోతు బంగారు రాజు బుధవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని పొగాకు గోడౌన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. గోడౌన్‌లోని మౌలిక వసతులు పొగాకు నిల్వలపై అధికారులతో సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా మేనేజర్ కరుణశ్రీ ఉన్నారు.
News December 17, 2025
జగిత్యాల: ఎంతమంది థర్డ్ జెండర్లు ఓటు వేశారో తెలుసా..?

జిల్లాలోని 20 మండలాల్లో కేవలం 9 మంది మాత్రమే థర్డ్ జెండర్లు ఓటర్ లిస్టులో తమ పేరును నమోదు చేసుకున్నారు. ఇందులో మెట్పల్లిలో ఒకరు, JGTLరూరల్లో ఇద్దరు, మల్యాలలో ఇద్దరు, ధర్మపురి, ఎండపెల్లి, గొల్లపల్లి, వెల్గటూర్ మండలాల్లో ఒక్కరి చొప్పున థర్డ్ జెండర్లు ఓటుహక్కు కలిగి ఉన్నారు. అయితే ఇటీవల 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కేవలం ఎండపల్లి మండలంలో ఉన్న ఒకే ఒక థర్డ్ జెండర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


