News January 9, 2025

రెవెన్యూ సదస్సులో 4,560 అర్జీలు: కలెక్టర్

image

ప.గో.జిల్లాలో 27 రోజులు పాటు 318 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 4,560 అర్జీలను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. డిసెంబర్ 13 నుంచి జనవరి 8 వరకు భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం 45 రోజులు గడువు విధించిందని, నిర్ణీత సమయంలోగా నూరు శాతం అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు.

Similar News

News January 9, 2025

కొవ్వూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొవ్వూరు మండలం కాపవరం సమీపంలోని గోవర్ధనగిరి మెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హైవే పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు గోపాలపురానికి చెందిన కె. వెంకటేశ్వరరావుగా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News January 9, 2025

ప.గో: జిల్లా మీదుగా నడిచే రెండు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్ పరిధిలోని సాంకేతిక మరమ్మతుల కారణంగా ఈ నెల 12న జిల్లా మీదుగా నడిచే రెండు రైళ్లను రద్దు చేస్తూ విజయవాడ డివిజనల్ రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 12న గుంటూరు- వైజాగ్(17239), వైజాగ్- గుంటూరు(17240) రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News January 9, 2025

గోపాలపురం: ఐదుగురు డైరెక్టర్లు, ఇద్దరు డ్రైవర్లపై క్రిమినల్ కేసు నమోదు

image

గోపాలపురం(M) కొమటిగుంట రైస్ మిల్లులో బయటపడిన అక్రమ PDS బియ్యం ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీశ్ తెలిపారు. అధికారులకు రాబడిన సమాచారం మేరకు తనిఖీలు చేయగా మిల్లులో44 బస్తాల బియ్యం, లారీలో లోడ్ చేసున్న 580 బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. విలువ రూ.14,31,111 ఉంటుందన్నారు. ఐదుగురు మిల్లు డైరెక్టర్లు, ఇద్దరు డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, లారీని సీజ్ చేశామన్నారు.