News August 24, 2024

రెవెన్యూ సేవలను ప్రజలకు వేగవంతంగా అందించాలి: కలెక్టర్

image

ప్రజలకు వేగవంతంగా రెవెన్యూ సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లో సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, మండల తహశీల్దార్లు, రెవిన్యూ సిబ్బందితో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవిన్యూ సర్వీసులలో భాగంగా మ్యుటేషన్లు, నాలా కనెక్షన్, నీటి పన్ను తదితర అంశాలలో కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

Similar News

News September 30, 2024

రాజంపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి బంగారు పతకం

image

రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కౌశిక్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పథకం సాధించినట్లు జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. హరియాణా రాష్ట్రంలో నిర్వహించిన సబ్ జూనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఆటల పోటీల కార్యక్రమంలో విద్యార్థి పాల్గొన్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉమ్మడి కడప జిల్లా విద్యార్థి బంగారు పతకం సాధించారని సంతోషం వ్యక్తం చేశారు.

News September 29, 2024

కలసపాడు: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

image

మండలంలోని ఎగువ రామాపురానికి చెందిన బీటెక్ విద్యార్థి తమిళనాడు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అన్నదమ్ములు ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో తమ్ముడు అర్జున్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అన్న అరవింద రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 29, 2024

రాజంపేట: బంగారు నగలు చోరీ

image

రాజంపేట పట్టణంలోని శ్రీకృష్ణదేవ రాయలు నగర్‌లో నివాసం ఉండే రవి ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి 70 గ్రాములు బంగారు నగలు చోరీ చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను సీఐ ఎల్లమ రాజు, ఎస్సై ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అయితే జిల్లాలో వారం రోజుల్లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.