News October 22, 2025

రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సేవల విషయంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలోని 18వ సచివాలయంలో రెవెన్యూ సంబంధిత సేవలలో ఆలస్యాలు, ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజల నుంచి అందిన 332 దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు.

Similar News

News October 22, 2025

సంగారెడ్డి: రేపు స్కౌట్ అండ్ గైడ్స్ పై శిక్షణ కార్యక్రమం

image

స్కౌట్ అండ్ గైడ్స్ కింద ఎంపికైన 38 పాఠశాలల నుంచి పాఠశాలల పీఈటీలకు గురువారం కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. పీఈటీలు సమయానికి శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.

News October 22, 2025

ADB: ఆరోగ్య పాఠశాలపై కలెక్టర్ సమీక్ష

image

ADB కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆరోగ్య పాఠశాల సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజార్షి షా హాజరై ఆరోగ్య పాఠశాల కార్యక్రమ అమలుపై అధికారులకు సూచనలు చేశారు. మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన స్వయంగా ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ అజయ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

News October 22, 2025

సదర్.. దద్దరిల్లనున్న నారాయణగూడ

image

సదర్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. నారాయణగూడ YMCA చౌరస్తాలో ప్రత్యేకంగా 4 వేదికలు ఏర్పాటు చేశారు. చెప్పల్‌బజార్, కాచిగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్‌తో పాటు నగర నలుమూలల నుంచి యాదవులు వేలాదిగా ఇక్కడికి తరలిరానున్నారు. దేశంలోనే పేరుగాంచిన దున్నరాజులను ప్రదర్శిస్తారు. భారీ లైటింగ్, నృత్యాలు, దున్నరాజులతో యువత విన్యాసాలు సదర్‌ వైభవాన్ని మరింత పెంచుతాయి. అర్ధరాత్రి వరకు డప్పుల మోతతో నారాయణగూడ దద్దరిల్లనుంది.