News October 29, 2025
రేగొండ: ఎయిర్ కూలర్ వైరు తగిలి చిన్నారి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ఆర్‌జీ తండాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఇంట్లో ఆడుకుంటున్న బానోతు అంజలి (3), కరెంటు బోర్డుకు, కిందకు వేలాడుతున్న ఎయిర్ కూలర్ వైరును ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 30, 2025
మెదక్: మహిళపై దాడి, దోపిడీ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

మెదక్ జిల్లాలో మహిళపై దాడి, దోపిడీ కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మహిళపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు లాక్కొని, అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో నిందితుడు పకీరా నాయక్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించిందని పేర్కొన్నారు. నిందితుడికి గతంలోనే వేరే కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది.
News October 30, 2025
హుజూర్‌నగర్‌కు మూడు పేర్లు

హుజూర్‌నగర్‌కు పాతకాలంలో పురుషోత్తమపురి, పోంచర్ల అనే రెండు పేర్లు ఉండేవి. ఫణిగిరి గుట్టపై శ్రీ సీతారామచంద్రస్వామి వెలయడంతో ఈ ప్రాంతం పురుషోత్తమపురిగా పేరొందింది. ఆ తర్వాత ముత్యాలమ్మ (పోచమ్మ) దేవాలయం ఏర్పడటంతో పోంచర్లగా మారింది. నవాబుల పాలనలో దీనిని హుజూర్‌నగర్‌గా మార్చారు. ఈ రెండు ఆలయాలు నేటికీ ఈ ప్రాంత ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉన్నాయి.
News October 30, 2025
జనగామ: నేడు పాఠశాలలకు సెలవు

జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తూ జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. అదేవిధంగా రేపు జరగాల్సిన ఎస్ఏ-1 పరీక్షలు నవంబరు 1వ తేదీన నిర్వహించాలని ఆయా పాఠశాలల నిర్వాహకులను ఆదేశించారు.


