News February 22, 2025

రేగొండ, చిట్యాల మండలాల రైతులకు మేలు

image

భూపాలపల్లి జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ నుంచి సరఫరా అయ్యే నీటి విడుదల వల్ల రేగొండ, చిట్యాల మండలాల రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వ్యవసాయ ఇరిగేషన్ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వ్యత్యాసం లేకుండా సాగు వాస్తవ నివేదికలు అందించాలని పేర్కొన్నారు. జిల్లాలో గత రబీ సీజన్లో 86 వేల ఎకరాల్లో పంట సాగు జరిగిందని, ఈ రబీ సీజన్లో 82 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Similar News

News December 23, 2025

సైనికుల సంక్షేమానికి మెప్మా నుంచి రూ.4 లక్షల విరాళం

image

సైనికుల సంక్షేమానికి శ్రీ సత్యసాయి జిల్లా మెప్మా శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు రూ.4 లక్షల విరాళాన్ని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్‌కు అందజేశారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లోని PGRS హాలులో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.పద్మావతి, అర్బన్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు విజయలక్ష్మి, జిల్లా సమాఖ్య సెక్రటరీ పద్మావతి, మెప్మా సీఎంఎం కలిసి సైనికుల సంక్షేమ నిధికి సంబంధించిన చెక్కును అందజేశారు.

News December 23, 2025

సంక్రాంతి బరిలో ముందుకొచ్చిన మూవీ!

image

ఈ సంక్రాంతికి థియేటర్ల వద్ద సందడి చేయడానికి సినిమాలు క్యూ కట్టాయి. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, శ్రీలీల నటించిన ‘పరాశక్తి’ సైతం అదృష్టం పరీక్షించుకోనుంది. అయితే రిలీజ్ డేట్‌పై మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. తొలుత JAN 14 అని చెప్పి తాజాగా JAN 10నే వస్తున్నట్లు ప్రకటించారు. రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర తెలుగు చిత్రాల మధ్య ఈ మూవీకి థియేటర్లు దొరుకుతాయో లేదో చూడాలి.

News December 23, 2025

రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

image

ఒంగోలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకును అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో రెడ్ క్రాస్ సంస్థను అభివృద్ధి చేయడానికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ సభ్యులు, అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్‌కు కొదువ లేకుండా చూడాలన్నారు.