News March 25, 2025

రేగొండ, పలిమెల, మల్హర్ మండలాల్లో వాటర్ షెడ్ యాత్ర

image

రేగొండ, పలిమెల, మల్హర్ మండలాల్లోని మండలానికి రెండు గ్రామాల చొప్పున వాటర్ షెడ్ యాత్రను నిర్వహించనున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నీటి పరిరక్షణ, సాగునీటి వనరుల పునరుద్ధరణ లక్ష్యంగా ‘వాటర్ షెడ్ యాత్ర’ చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. నీటి నిల్వలను మెరుగుపరచడం, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం, రైతులకు నీటి సదుపాయం అందించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

Similar News

News January 2, 2026

ధనుర్మాసం: పద్దెనిమిదో రోజు కీర్తన

image

‘ఏనుగు వంటి బలమున్న నందగోపుని కోడలా! సుగంధభరిత కేశాలు కల నీళాదేవి! కోళ్లు కూస్తున్నాయి, కోకిలలు గానం చేస్తున్నాయి. నీవు కృష్ణుడితో సరస సంభాషణల్లో మునిగి మమ్మల్ని మరువకు. మీ మధ్య వాదన వస్తే మేము నీ పక్షమే వహిస్తాం. నీ గాజులు ఘల్లుమనేలా నడచి వచ్చి, నీ ఎర్రని తామరల వంటి చేతులతో తలుపులు తీయమ్మా!’ అని వేడుకుంటున్నారు. ఇక్కడ తలుపులు తీయడమంటే భక్తుడికి, భగవంతుడికి మధ్య అడ్డుతెరలను తొలగించడం! <<-se>>#DHANURMASAM<<>>

News January 2, 2026

KMR: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 242 కేసులు

image

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 242 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి సబ్ డివిజన్‌లో 117 కేసులు, బాన్సువాడ సబ్ డివిజన్‌లో 70 కేసులు, ఎల్లారెడ్డి సబ్ డివిజన్‌లో 55 కేసులు నమోదు అయినట్లు జిల్లా SP రాజేష్ చంద్ర వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News January 2, 2026

నా భర్త ముఖంపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు: బంగ్లా బాధితురాలు

image

బంగ్లాదేశ్‌లోని షరియత్‌పూర్ జిల్లాలో ఖోకన్ దాస్ అనే <<18733577>>హిందువుపై<<>> దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. తన భర్తకు ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవని, ఎందుకు అంత కిరాతకంగా ప్రవర్తించారో తెలియడం లేదని బాధితుడి భార్య సీమా దాస్ వాపోయారు. తన భర్త తల, ముఖంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము హిందువులమని, శాంతియుతంగా బతకాలని కోరుకుంటున్నామని చెప్పారు.