News March 17, 2025
రేగొండ: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త ఆత్మహత్య

రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన చావడి లక్ష్మి నరసయ్య(50) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నరసయ్య.. కుటుంబ ఆర్థిక విషయాల్లో భార్యాభర్తలు గొడవ పడినట్లు చెప్పారు. కాగా మనస్తాపం చెందిన నరసయ్య ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.
Similar News
News March 17, 2025
పెళ్లైన మగవారు బరువు ఎందుకు పెరుగుతారంటే?

వివాహం తర్వాత పురుషులు అనూహ్యంగా బరువు పెరుగుతుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెళ్లైన ఆనందంలో పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లి కొంచెం ఎక్కువగా ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఈ సమస్య వస్తుంది. బాధ్యతలు పెరిగి జిమ్‌కు వెళ్లే సమయం ఉండదు కాబట్టి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగిపోతారు. హార్మోన్ల మార్పుల వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి మరో కారణం.
News March 17, 2025
రూ.400కోట్లు పన్నులు చెల్లించాం: శ్రీరామ జన్మభూమి ట్రస్ట్

మహాకుంభమేళా సమయంలో కోటి 26లక్షల మంది భక్తులు అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. గత ఐదేళ్లలో రూ. 400కోట్ల పన్నులు ప్రభుత్వానికి చెల్లించినట్లు కార్యదర్శి వెల్లడించారు. అయోధ్యకు వచ్చే భక్తులు, పర్యాటకులు సంఖ్య 10రెట్లు పెరిగిందని, స్థానికుల ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. గతేడాది 5కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.
News March 17, 2025
సంగారెడ్డి: సైబర్ మోసగాళ్ల వలలో పడొద్దు: ఎస్పీ

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్‌లకు అలవాటు పడి, సైబర్ మోసగాళ్లు పన్నిన ఉచ్చులో పడవద్దని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ హెచ్చరించారు. యువత డబ్బులు కోల్పోయి అప్పులపాలై, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అక్రమ బెట్టింగ్ యాప్‌లలో బెట్టింగ్‌లకు పాల్పడినా ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడినా, ప్రోత్సహించిన వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవన్నారు.