News March 14, 2025
రేగొండ: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన గోరి కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్ల పల్లి గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రవి(52) డీబీఎం-38 కెనాల్ మోటార్ పైపు కింద చెత్తను తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరణ జరిగి రైతు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.
Similar News
News December 26, 2025
WNP: రేపు కలెక్టరేట్ ఎదుట ధర్నా

జర్నలిస్టుల అక్రిడిటేషన్ల నూతన విధానానికి వ్యతిరేకంగా ఈనెల 27న జిల్లా WNP కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేపట్టనున్నట్లు టీయూడబ్ల్యూజే (హెచ్ 143) జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్‌రావు తెలిపారు. శనివారం 11 గ. నిర్వహించే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు.
News December 26, 2025
‘ఇండియా నన్ను బాగు చేసింది’.. NRI పోస్ట్ వైరల్

తన అనారోగ్యాన్ని ఇండియా నయం చేసిందని ఓ NRI చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘పదేళ్ల క్రితం US వెళ్లా. డేటా సైంటిస్టుగా పని చేస్తుండగా schizoaffective డిజార్డర్ (మానసిక వ్యాధి) ఉన్నట్లు 2018లో తేలింది. US హెల్త్ కేర్ సిస్టమ్ నన్ను భయపెట్టింది. దీంతో 2024లో ఇండియాకు వచ్చా. ఇప్పుడు నాకు నయమైంది. ఇక్కడి హెల్త్ సిస్టమ్, డాక్టర్ల వల్లే ఇది సాధ్యమైంది. నన్ను మనీ మెషీన్లుగా చూడలేదు’ అని రెడిట్‌లో రాసుకొచ్చారు.
News December 26, 2025
కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు 940మంది రిజిస్ట్రేషన్

కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలు ఈనెల 27, 28 తేదీల్లో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 4న ప్రారంభమైన ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు తరలివస్తుండగా 940 మంది రిజిస్ట్రేషన్ చేశారు. 27న ప్రారంభ సమావేశం, 28న పూర్వ విద్యార్థుల సమావేశం, ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.


