News April 13, 2025
రేగొండ: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన నీటూరి నీలమ్మ (59) ఆదివారం ఉదయం ఇంటి వద్ద పనులు చేస్తూ కిటికీ ఊచలను పట్టుకుంది. ఇంట్లోకి వెళ్లే విద్యుత్ తీగలు కిటికికీ తాకడంతో కిటికీని పట్టుకున్న నీలమ్మకు షాక్ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 14, 2025
NRPT: ‘అంబేడ్కర్ మహానుభావుడు’

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ ఛైర్మన్ సీత దయాకర్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని నారాయణపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ముందుచూపుతో దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు.
News April 14, 2025
BREAKING: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

TG: ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. A గ్రూపునకు 1 శాతం, B గ్రూపునకు 9 శాతం, C గ్రూపునకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించింది.
News April 14, 2025
‘బ్లూ ఆరిజన్’ మిషన్.. నేడు అంతరిక్షంలోకి మహిళల బృందం

జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజన్’ సంస్థ ఇవాళ న్యూ షెపర్డ్ రాకెట్‌లో ఆరుగురు మహిళలను అంతరిక్షంలోకి పంపనుంది. టెక్సాస్ నుంచి రా.7 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న ఈ రాకెట్‌లో బెజోస్ ప్రేయసి లారెన్, పాప్ సింగర్ కేటీ పెర్రీ సహా మరో నలుగురు మహిళలు వెళ్లనున్నారు. భూమికి, అంతరిక్షానికి మధ్యనున్న కర్మన్ రేఖను దాటి వెళ్లి జీరో గ్రావిటీని అనుభవిస్తారు. అక్కడి నుంచి భూమిని వీక్షిస్తారు. ఈ మిషన్ 11min పాటు సాగనుంది.