News April 13, 2025
రేగొండ: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన నీటూరి నీలమ్మ (59) ఆదివారం ఉదయం ఇంటి వద్ద పనులు చేస్తూ కిటికీ ఊచలను పట్టుకుంది. ఇంట్లోకి వెళ్లే విద్యుత్ తీగలు కిటికికీ తాకడంతో కిటికీని పట్టుకున్న నీలమ్మకు షాక్ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 14, 2025
ఉక్రెయిన్‌కు రండి.. ట్రంప్‌కు జెలెన్స్కీ ఆహ్వానం

US అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ సందర్శించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. రష్యా తమ దేశంలో చేసిన విధ్వంసం చూడాలన్నారు. యుద్ధంతో తమ దేశంలో నెలకొన్న పరిస్థితులు, మరణించిన, గాయపడిన ప్రజలు, దెబ్బతిన్న కట్టడాల్ని చూసిన అనంతరం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఫిబ్రవరిలో ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన చర్చలు వాగ్వాదంతో అర్ధాంతరంగా ముగిశాయి.
News April 14, 2025
అంబేడ్కర్‌కి నివాళి అర్పించిన కలెక్టర్

ఒంగోలులో అధికారులు, ప్రజాప్రతినిధులు అంబేడ్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. HCM కళాశాల సెంటర్, కలెక్టరేట్ సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు జిల్లా కలెక్టర్ అన్సారియా, ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డీఆర్ఓ చిన్న ఓబులేసు, వివిధ దళిత సంఘాల నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్ గురించి కొనియాడారు.
News April 14, 2025
సంచలనం.. దంతాలు ఎప్పుడు ఊడినా వృద్ధి చేయొచ్చు

పిల్లల్లో పాలదంతాలు ఊడిపోయి కొత్తవి వస్తాయి. వాటిని కోల్పోతే మళ్లీ రావు. తాజాగా ప్రపంచంలోనే తొలిసారి UK సైంటిస్టులు ల్యాబ్‌లో మానవ దంతాలను సృష్టించారు. దంతాల వృద్ధికి అవసరమైన వాతావరణాన్ని కల్పించే ఓ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో రోగులు కోల్పోయిన దంతాలను వారిలోనే వృద్ధి చేయొచ్చంటున్నారు. ఫిల్లింగ్స్, ఇంప్లాంట్స్ అవసరం ఉండదని, దంత రక్షణలో ఇదో విప్లవాత్మక పురోగతి అని చెబుతున్నారు.