News January 6, 2025

రేగోడ్:గ్రామపంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుందా?

image

ఈ నెల రెండో వారంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నగారా మోగనున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో రేగోడ్ మండలంలోని 17 గ్రామపంచాయతీలో ఎన్నికల హడావిడి ఊపందుకొనుంది. సంక్రాంతి తర్వాత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారులు సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికల గుర్తులను ముద్రణ చేసేందుకు సిద్ధమయ్యారు.

Similar News

News December 24, 2025

ఐటీ విభాగంలో మెదక్ పోలీస్ సిబ్బంది ప్రతిభ

image

మెదక్ జిల్లా పోలీస్ సిబ్బంది CCTNS/ ఐటీ ఆధారిత వ్యవస్థల అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర అదనపు డీజీపీ(టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు చేతుల మీదుగా కమెండేషన్ లెటర్స్, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. మెదక్ జిల్లా నుంచి ఐటీ కోర్ టీం సభ్యులు అనిల్, ఆర్.అమరనాథ్, టెక్ టీం రైటర్స్ మౌనిక, రాజు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీరిని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.

News December 24, 2025

బీజేపీ సర్పంచ్‌లకు రూ. 25 లక్షల నిధులు: ఎంపీ రఘునందన్

image

బీజేపీ మద్దతుతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల అభివృద్ధి నిధులు తప్పకుండా తీసుకొస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధిలో బీజేపీ ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

News December 24, 2025

నర్సాపూర్: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

image

ప్రేమ విఫలం కావడంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన వేణు (24) డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఇంటి నుంచి వెళ్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.