News May 10, 2024
రేణిగుంటలో వైసీపీ ఆఫీసు సీజ్

రేణిగుంట వైసీపీ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. పట్టణంలోని వంతెన కింద వైసీపీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు నిత్యం ఇక్కడే ఉంటారు. ఎన్నికల సందర్భంగా అక్కడ తాయిలాలు అందజేస్తున్నట్లు సమాచారం రావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సలోని, ఎంపీడీవో విష్ణు చిరంజీవి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. తనిఖీలు చేసి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News March 1, 2026
రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు అర్జీలు అందించి సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.
News March 1, 2026
చిత్తూరు: HPV వ్యాక్సిన్‌పై అవగాహన

సర్వైకల్ క్యాన్సర్ వ్యాపించకుండా 14 ఏళ్లలోపు బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న సర్వేలో 4185 మంది క్యాన్సర్ అనుమానితులను గుర్తించారు. ఈ వ్యాక్సిన్ 18,500 మంది బాలికలకు అందించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు.
News March 1, 2026
చిత్తూరు: చెత్త ఇస్తే డబ్బులు.. ఎంతో తెలుసా.?

పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం నెలలో ఒకరోజు పంచాయతీల పరిధిలో ఈ వాహనం పర్యటిస్తుందని అధికారులు తెలుపుతున్నారు. వాహనాలకు అందజేస్తే పాత ఇనుముకు కేజీ రూ. 20, అల్యూమినియం రూ. 120, స్టీల్ రూ.40, పేపర్లు రూ.15, పుస్తకాలు, అట్టపెట్టెలు రూ.10, ప్లాస్టిక్ రూ.20 చొప్పున చెల్లిస్తారని పేర్కొంటున్నారు.


