News June 13, 2024
రేణిగుంట: ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు లభించింది. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
Similar News
News December 23, 2025
పుంగనూరు: అనపకాయలకు భలే డిమాండ్

చిత్తూరు జిల్లాలో ఈ సీజన్‌లో అనపకాయలు విరివిగా లభిస్తాయి. పలువురు రైతులు వీటిని ప్రధాన పంటగా, అంతర్ పంటగా భూముల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం రైతులు కిలో రూ.50 చొప్పున మార్కెట్లో విక్రయిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రానికి ఇవి ఎగుమతి అవుతున్నాయి. అనప గింజలు, పితికి పప్పు కూరను పలువురు ఇష్టంగా తింటారు. అలాగే వీటిని నూనెలో వేయించి స్నాక్స్‌గా కూడా వాడుతారు.
News December 23, 2025
నగరిలో టీడీపీ నేత అక్రమాలు: YCP

నగరి ఎమ్మెల్యే అండతో టీడీపీ నేత భారీగా రేషన్ అక్రమ రవాణా చేశారని వైసీపీ ఆరోపించింది. నిండ్రలోని నెట్టేరి వద్ద తనిఖీల్లో 4 టన్నుల రేషన్ బియ్యంతో టీడీపీ ఎస్సీ సెల్ నేత అల్లిముత్తు పట్టుబడినట్లు తెలిపింది. తర్జనభర్జనల తర్వాత అల్లిముత్తు , కార్తీక్ , విక్రమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, సీజ్ ద షిప్ అనే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించింది.
News December 23, 2025
చిత్తూరు: మూడేళ్ల నుంచి 257 మంది మృతి

బైక్ ప్రమాదాలలో మృత్యువాతను తప్పించేలా చిత్తూరు జిల్లాలో పోలీసులు హెల్మెట్ వాడకంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకపోవడంతో 2023లో 84 మంది, 2024లో 90, ఈ సంవత్సరం ఇప్పటివరకు 83 మంది ప్రమాదాలలో మృతి చెందారు. వీటిని అరికట్టేందుకు అధికారులు గత కొద్ది రోజులుగా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారిలో మార్పుకు ప్రయత్నిస్తున్నారు.


