News February 6, 2026

రేపటితో పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు ముగింపు

image

మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కలెక్టర్ అనుదీప్ సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోరుకునే వారు ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించారు. అభ్యర్థులు ఫారమ్-12తో పాటు డ్యూటీ ఆర్డర్, ఎపిక్ కార్డు నకళ్లను సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారు 8న తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News February 10, 2026

ఖమ్మం: దివ్యాంగులకు అలర్ట్.. దరఖాస్తుకు నేడే ఆఖరు!

image

దృష్టి, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులు ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి వెల్పుల విజేత తెలిపారు. అర్హులు ఈ సాయంత్రంలోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువు దాటిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని ఆమె స్పష్టం చేశారు.

News February 10, 2026

ఖమ్మం: తెలంగాణ పోరాట యోధురాలు మృతి

image

తెలంగాణ పోరాట యోధురాలు గండూరి నర్సు బాయమ్మ మరణించారు. ఖమ్మం పరిధి మామిండ్ల గూడెంలో నివాసం ఉంటున్న ఆమె అనారోగ్యంతో మృతిచెందారు. కాగా ఆమె భర్త, సీపీఎం నేత గండ్లూరి కిషన్‌రావు 1976లో మామిండ్లగూడెంలోని తన ఇంటి సమీపంలోనే హత్యకు గురయ్యారు. ఆమె గతంలో ముదిగొండ మండలం బాణాపురం సర్పంచ్‌గా పని చేశారు. నర్సు బాయమ్మ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

News February 10, 2026

సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఫిబ్రవరి 11న ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపల్ పరిధుల్లో పని చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా యజమానులు సహకరించాలని కోరారు.