News October 9, 2025
రేపటినుంచి చార్మినార్ సర్కిల్ అటవీ శాఖ క్రీడా పోటీలు

అటవీ శాఖ చార్మినార్ సర్కిల్ ప్రాంతీయ క్రీడా పోటీలు ఈ నెల 10, 11 తేదీల్లో దూలపల్లిలోని తెలంగాణ అటవీ అకాడమీలో జరుగనున్నాయి. పరుగు పందెం, నడకపోటీ, వెయిట్ లిఫ్టింగ్, షటిల్, క్యారమ్స్, చెస్, లాన్‌టెన్నీస్, టేబుల్ టెన్నీస్, రైఫిల్ షూటింగ్, అర్చరీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, హాకీ, టగ్ ఆఫ్ వార్, సైక్లింగ్, మారథాన్ తదితర పోటీలు నిర్వహించనున్నారు.
Similar News
News October 10, 2025
జూబ్లీహిల్స్ : ఓపెన్ వర్సిటీలో నేడు ప్లేస్‌మెంట్ డ్రైవ్

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో స్టైఫండ్ బేస్డ్ అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులక ఈ-ప్లేస్‌మెంట్ డ్రైవ్ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డా.ఎల్వీకే రెడ్డి తెలిపారు. ఈ డ్రైవ్‌లో 8 ప్రముఖ రిటైల్ సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. ప్లేస్‌మెంట్ డ్రైవ్ ఉ.10 గంటలు నుంచి సీఎస్‌టీడీ భవనంలో ప్రారంభమవుతుందని తెలిపారు.
News October 10, 2025
HYD, మేడ్చల్, రంగారెడ్డిలో 12న పోలియో వ్యాక్సిన్

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో ఈ నెల 12న పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా జిల్లా అధికారులు తెలిపారు. 3 జిల్లాల పరిధిలో 12న ఐదేళ్లలోపు పిల్లలకు అందించాలని డాక్టర్లు సూచించారు. ఈ ప్రోగ్రాం కోసం ప్రత్యేక సెంటర్లు సైతం ఏర్పాటు చేస్తామన్నారు. నిండు ప్రాణాలకు- రెండు చుక్కలు వేయించాలని అధికారులు పిలుపునిచ్చారు.
News October 10, 2025
పటాన్‌చెరు LIGలో పేలుడు

పటాన్‌చెరులోని రామచంద్రపురంలోని LIGలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఇందులో గ్యాస్ లీక్ కాగా కట్టడి చేసేందుకు ప్రయత్నించిన సమయంలో పేడులు జరిగింది. ఈ ఘటనలో అనంత్ స్వరూప్(22) అనే మృతి చెందినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.