News November 13, 2025
రేపటి తరానికి మార్గదర్శనం మన అలవాట్లే

మంచి అలవాట్లు మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి, ఇంట్లో పిల్లలకు ఆదర్శంగా ఉంటాయి. ఓ వ్యక్తి ఆఫీస్ సమయానికి 20 నిమిషాల ముందు లేచి, హడావిడిగా సిద్ధమయ్యేవాడు. కొన్నాళ్లకు అతడి కుమారుడు కూడా అదే పద్ధతిని అనుసరించాడు. మనం నేర్పించే ప్రతి పాఠం, మన నడవడిక నుంచే మొదలవుతుంది. అందుకే, మన అలవాట్లు మనల్నే కాక, మన తర్వాత తరాలను కూడా ప్రభావితం చేస్తాయని మరువకూడదు. మంచి అలవాట్లే నిజమైన వారసత్వం. <<-se>>#Jeevanam<<>>
Similar News
News November 13, 2025
నేటి నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు

AP: నేటి నుంచి ఈ నెల 25 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 3 వరకు రూ.50, డిసెంబర్ 10 వరకు రూ.200, డిసెంబర్ 15 వరకు రూ.500 లేట్ ఫీజుతో చెల్లించవచ్చని వెల్లడించారు. ఫీజును https://bse.ap.gov.inలో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. గడువు పొడిగింపు ఉండబోదని స్పష్టంచేశారు.
News November 13, 2025
కొబ్బరి సాగు.. భూమిని బట్టి నీరివ్వాలి

కొబ్బరి తోటలను నల్ల భూముల్లో పెంచుతుంటే 20 రోజులకు ఒకసారి, తేలికపాటి ఎర్రభూముల్లో సాగు చేస్తుంటే 10 రోజులకు ఒకసారి తప్పకుండా నీటిని అందించాలి. తేలిక భూముల్లో అయితే వేసవి కాలంలో 5 నుంచి 7 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి. కొబ్బరి తోటలు నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. తోటల్లో నీటి ఎద్దడి వల్ల కొబ్బరిలో పిందెరాలడం, కాయ పరిమాణం తగ్గడం వంటి సమస్యలు తలెత్తి పంట దిగుబడి తగ్గుతుంది.
News November 13, 2025
శివుడికి మూడో నేత్రం నిజంగానే ఉంటుందా?

శివుడికి మూడో నేత్రం ఉంటుంది. కానీ, చిత్రపటాల్లో చూపించినట్లు అది భౌతికమైనది కాదు. ఆ నేత్రం జ్ఞానానికి, అంతర దృష్టికి సంకేతం. దాని ద్వారానే ఆయన లోకాలను నడిపిస్తున్నాడు. ఆయన అంతటి జ్ఞానవంతుడని తెలిపేందుకే విగ్రహాలు, ఫొటోల్లో ఆ నేత్రాన్ని చూపిస్తారు. జ్ఞానం అనే ఈ మూడో కన్ను మనక్కూడా ఉంటుందని, దాని ద్వారా జీవిత సత్యాన్ని తెలుసుకున్నవారు మోక్షం వైపు అడుగులేస్తారని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#SIVA<<>>


