News October 2, 2024
రేపటి నుంచి ఈ రైళ్లు పునః ప్రారంభం

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గత నెలలో తాత్కాలికంగా నిలిపివేసిన రైళ్లను ఈనెల 3 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ (11020/11019), ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ (12706/12705) భద్రాచలం రోడ్ ప్యాసింజర్ పునః ప్రారంభం ఎక్స్ప్రెస్ చెప్పారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News September 14, 2025
ఖమ్మంలో లోక్ అదాలత్.. 597 కేసులు పరిష్కారం

ఖమ్మం జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ ప్రారంభించారు. లోక్ అదాలత్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని ఆయన చెప్పారు. ఈ లోక్ అదాలత్లో మొత్తం 4,746 కేసులను గుర్తించగా, వాటిలో 597 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. భార్యాభర్తల గొడవలు, ఆస్తి వివాదాలు, బ్యాంక్ రికవరీ, రోడ్డు ప్రమాదాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు
News September 13, 2025
ఖమ్మం జిల్లాలో 15 నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల బంద్

ఖమ్మం జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటించనున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బకాయిలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
News September 13, 2025
ఖమ్మం: కాంగ్రెస్లో వర్గపోరు.. పరస్పరం దాడులు

బోనకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రెండు వర్గాల నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒక వ్యక్తి చెవి తెగిపోగా, మరొకరిని మహిళలు చెప్పులతో కొట్టి గాయపరిచారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.