News March 14, 2025

రేపటి నుంచి ఒంటిపూట బడులు: DEO

image

ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఆదేశించారు. ఉదయం 7.45 ని.ల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్స్ నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల తరగతులు పెట్టాలని చెప్పారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని పాఠశాలల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలన్నారు.

Similar News

News November 7, 2025

వందేమాతర ఉద్యమంలో గుంటూరు పాత్ర

image

వందేమాతర నినాదం స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో 1905–11మధ్య ‘వందేమాతర యుగం’గా ప్రసిద్ధి చెందింది. ఈ పోరాటం ఉధృతి గుంటూరు జిల్లాలో మహోజ్వలంగా కొనసాగింది. చేబ్రోలులోని రెడ్డిపాలెం రైతు చిన్నపరెడ్డి బ్రిటిష్ పోలీసు అధికారిపై తిరగబడ్డారు. తుపాకీతో తన ఎద్దును కాల్చడంతో ఆగ్రహించిన చిన్నపరెడ్డి, ఇతర రైతులతో కలిసి అధికారిని చితకబాదారు. ఈ నేరానికి ఆంగ్ల ప్రభుత్వం చిన్నపరెడ్డి సహా ముగ్గురికి ఉరిశిక్ష విధించింది.

News November 7, 2025

పెదనందిపాడు: ప్రభుత్వ ఆడిటర్ ఇంట్లో సీబీఐ సోదాలు

image

పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలో శుక్రవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ ఆడిటర్ గుమ్మడిల్లి శివ నాగేశ్వరరావు నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారులు ఆయన ఇంట్లోనే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. పూర్తి వివరాలు అధికారులు వెల్లడించిన తర్వాత తెలియనున్నాయి.

News November 7, 2025

దుగ్గిరాల పసుపు యార్డులో ధరలు ఇలా..!

image

దుగ్గిరాల యార్డు పసుపుకు పెట్టింది పేరు. అయితే పసుపు యార్డులో ధరలు గురువారం జరిగిన వేలంలో ఈ విధంగా నమోదయ్యాయి. కొమ్ములు క్వింటాకు కనిష్ఠ ధర రూ.10,800, గరిష్ఠ ధర రూ.12,500, మోడల్ ధర రూ.12,500 పలికాయి. కాయ క్వింటాల్‌కు కనిష్ఠ ధర రూ.11,800, గరిష్ఠ ధర రూ.12,400, మోడల్ ధర రూ.12,400 పలకగా, మొత్తం 218 బస్తాల పసుపును రైతులు వ్యాపారులకు విక్రయించారని సిబ్బంది చెప్పారు.