News March 31, 2026

రేపటి నుంచి జాగ్రత్త!

image

APలో రేపటి నుంచి 4 రోజులపాటు అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముందని APSDMA వెల్లడించింది. రేపు పోలవరం(D) చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. విజయనగరం(D) బాడంగి, తెర్లాం, వంగర, మన్యం(D) గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, సీతానగరం మండలాల్లో వడగాలులు వీస్తాయంది. ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది.

Similar News

News April 13, 2026

1,055 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 1,055 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మైనింగ్ సర్దార్-577, డి.సర్వేయర్-43, అసిస్టెంట్ ఫోర్‌మెన్-435 ఉద్యోగాలున్నాయి. జాబ్‌ను బట్టి టెన్త్, మైనింగ్/ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, డిగ్రీ, సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, వయసు 18-30ఏళ్లు ఉండాలి. CBT ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నెల 15 నుంచి మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు.
సైట్: https://secl-cil.in/

News April 13, 2026

పెరిగిన క్రూడాయిల్ ధరలు!

image

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ముడి చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కు 8.36% ఎగసి 103 డాలర్లకు చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 8.2% పెరిగి $104.57 వద్ద కొనసాగుతున్నాయి. యురోపియన్ గ్యాస్ ఫ్యూచర్స్ ఓ దశలో 18% పెరిగాయి. ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకలు <<19635574>>నిలిపేస్తామని<<>> US హెచ్చరించడంతో క్రూడ్ ధరలు మరింతగా ఎగిసే అవకాశం ఉంది.

News April 13, 2026

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు.. UPDATE

image

AP: రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో <<19603357>>డీలిమిటేషన్<<>> ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం వార్డులు, డివిజన్లు 3,206 ఉండగా 2011 జనాభా లెక్కల ప్రకారం మరో 736 పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆ సంఖ్య 3,942కు చేరనుంది. ఈ ప్రక్రియ ముగియగానే ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని SEC భావిస్తోంది. ఇక మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు కోర్టు కేసులు తేలాక ఎలక్షన్స్ నిర్వహించనుంది.