News December 18, 2025

రేపటి నుంచి జిల్లా బాల వైజ్ఞానిక ప్రదర్శన

image

రేపటి నుంచి రెండు రోజుల పాటు జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈఓ సిద్ధార్థ రెడ్డి తెలిపారు. బండారుపల్లి మోడల్ స్కూల్‌లో ఈ నెల 19, 20న కార్యక్రమం జరుగుతుందన్నారు. వికసిత్, ఆత్మ నిర్భర భారత్ కొరకు ‘STEM’ ఆధారంగా చేసుకొని సృజనాత్మక నమూనాలు, ప్రాజెక్టులను విద్యార్థుల చేత ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. 20 ప్రాజెక్ట్‌లు, 500 ఎగ్జిబిట్లను నమోదు చేసినట్లు చెప్పారు.

Similar News

News December 24, 2025

జిల్లాకు తలమానికం ‘జలజీవన్ మిషన్’: కలెక్టర్

image

జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా జలజీవన్ మిషన్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రూ.1,650 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును మంజూరు చేసిందని, ఇది జిల్లా అభివృద్ధికి తలమానికమని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

News December 24, 2025

తిరుమలకు ఫేక్ టికెట్లతో వస్తున్నారా..?

image

తిరుమల వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో SP సుబ్బరాయుడు కీలక ప్రకటన చేశారు. ‘డిసెంబర్ 30, 31, జనవరి 1న లక్కీడిప్ టోకెన్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తాం. అన్ని టోకెన్లను స్కాన్ చేసి అందులోని టైం ప్రకారమే పంపుతాం. నకిలీ టోకెన్లు సృష్టించిన వారిపై, అవి నకిలీ అని తెలిసి కూడా తిరుమలకు తెచ్చిన వారినైనా కేసులు పెడతాం. ఆటో, జీపు డ్రైవర్లు భక్తులను మిస్ గైడ్ చేస్తే చర్యలు ఉంటాయి’ అని SP హెచ్చరించారు.

News December 24, 2025

పద్మ అవార్డులు పేర్ల ముందు, వెనుక ఉంచొద్దు: బాంబే హైకోర్టు

image

‘పద్మ’ అవార్డులను పేర్ల ముందు, వెనుక వినియోగించుకోరాదని బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పద్మ అవార్డీ శరద్ హార్దికర్ కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఆయా రంగాల్లో చేసిన కృషి, సామాజిక సేవకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ అవార్డులు అందిస్తోందని, దీన్ని గౌరవంగా భావించాలే తప్ప టైటిల్‌గా కాదని స్పష్టం చేసింది. కాగా దీనిపై సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయినా కొందరు పట్టించుకోవడం లేదు.