News October 29, 2025
రేపటి నుంచి పాఠశాలలు యథాతదం: డీఈవో

ఏలూరు జిల్లాలో తుఫాను ప్రభావం తగ్గిన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి యథాతథంగా కొనసాగనున్నట్లు డీఈవో వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాను కారణంగా పాఠశాల ప్రాంగణాలు దెబ్బతినలేదని స్పష్టత తీసుకున్న తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతించాలని డీఈవో సూచించారు. ఈ మేరకు బుధవారం రాత్రి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Similar News
News October 29, 2025
నరసాపురం: ప్రజలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

నరసాపురం మండలంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను బుధవారం కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. తొలుత జిల్లా కలెక్టర్ పీఎం లంకలో డిజిటల్ భవన్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి, ఆశ్రయం పొందిన వారిని ఆప్యాయంగా పలకరించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు భోజనాన్ని స్వయంగా వడ్డించి కలెక్టర్ కూడా వారితో పాటు కూర్చుని భోజనాన్ని స్వీకరించారు.
News October 29, 2025
కల్లెడ చెరువు కట్ట సురక్షితమేనా..?

తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షంలో అత్యధికంగా మండలంలోని కల్లెడలో ఉంది. వర్షంతో గ్రామంలో 36.7 సెం.మీ వర్షపాతం నమోదయింది. దీంతో గ్రామంలోని చెరువుకట్ట పరిస్థితి ఏంటని గ్రామస్థులు భయపడుతున్నారు. మూడేళ్ల క్రితం కురిసిన వర్షాలకు గ్రామంలోని చెరువు కట్టకు సమానంగా నీరు చేరడంతో బూర్గుమళ్ల వైపు కట్టని తొలగించి నీటిని తీసివేశారు. ప్రస్తుతం కట్ట పరిస్థితిపై గ్రామస్థులు భయపడుతున్నారు.
News October 29, 2025
నాలుగు నెలల్లో రైతుల ఫ్లాట్లు పంపిణీ చేస్తాం: మంత్రి నారాయణ

అమరావతి రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. సచివాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే చర్య అని మండిపడ్డారు. రాబోయే నాలుగు నెలల్లో రైతులందరికీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


