News January 5, 2025

రేపటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు: కలెక్టర్ ప్రశాంతి

image

తూర్పు గోదావరి జిల్లాలో 0-6 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన పిల్లలకి ఆధార్ నమోదు కార్యక్రమానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం తెలిపారు. జిల్లాలో సుమారు 17,000 మంది పిల్లలు వివిధ కారణాలవల్ల ఆధార్ సంఖ్య లేని వారు ఉండే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగిందన్నారు. సోమవారం నుంచి 10వ తేదీ వరకు 0-6 మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు.

Similar News

News January 7, 2025

కే.గంగవరం మండలంలో హత్య

image

కే.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూళ్ల గ్రామంలో సోమవారం రాత్రి సత్తి సువర్ణ రత్నం (35)ని అదే గ్రామానికి చెందిన మంచాల వెంకట సూర్య చంద్ర వివాహేతర సంబంధం కారణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News January 7, 2025

కోనసీమ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ

image

ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ తరువాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 15 లక్షల 31 వేల 161 మంది ఓటర్లు ఉన్నారు. ఇన్‌ఛార్జ్ డీఆర్ఓ మాధవి సోమవారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 7 లక్షల 72 వేల 150 మంది, పురుషులు 7 లక్షల 58 వేల 984 మంది ఉన్నారు. కోనసీమ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల జాబితాలను కూడా ఆమె విడుదల చేశారు.

News January 6, 2025

పెద్దాపురం: లారీ ఢీకొని వ్యక్తి మృతి

image

పెద్దాపురం ఇండస్ట్రియల్ ప్రాంతంలో సోమవారం లారీ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. సామర్లకోట గణపతి నగరానికి చెందిన పెంకె అప్పారావు బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు అప్పారావు పట్టాభి ఆగ్రో ఫుడ్స్ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఘటనపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.