News November 8, 2025

రేపటి నుంచి మద్యం షాపులు బంద్: CP

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు HYD సీపీ సజ్జనార్ వెల్లడించారు. రేపు సా.6 నుంచి ఈ నెల 11న (పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఈ నెల 14న కౌంటింగ్ సందర్భంగా ఉ.6 నుంచి 15న ఉ.6 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. నిర్దేశించిన సమయాల్లో హోటళ్లు, రెస్టారెంట్‌లు, క్లబ్బులు కూడా మూసివేయాలన్నారు.

Similar News

News November 8, 2025

AP న్యూస్ రౌండప్

image

☛ కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్.. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని హామీ
☛ తిరువూరు వివాదం.. CBNకు TDP క్రమశిక్షణ కమిటీ నివేదిక
☛ వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి
☛ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో సీదిరి అప్పలరాజుకు నోటీసులు.. కాశీబుగ్గ PSలో 3గంటలుగా ప్రశ్నిస్తున్న పోలీసులు

News November 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 60 సమాధానాలు

image

1. కృష్ణుడి మొదటి గురువు ‘సాందీపని’.
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ‘బృందావనం’ అని అంటారు.
3. నాగులకు తల్లి ‘కద్రువ’.
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ‘బ్రహ్మ’.
5. స్కందుడు అంటే ‘కుమారస్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 8, 2025

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తులు ఎంతంటే?

image

పలు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్‌(ADR) నివేదిక విడుదల చేసింది. APలో మొత్తం ఎమ్మెల్యేల ఆస్తులు రూ.11,323 కోట్లు కాగా తెలంగాణ ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.4,637 కోట్లుగా పేర్కొంది. దేశంలో అత్యధికంగా కర్ణాటక ఎమ్మెల్యేలకు రూ.14,179 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. అటు దేశంలో 119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో KAలో 31 మంది, APలో 27 మంది ఉన్నారు.