News December 21, 2025
రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి: ఖమ్మం కలెక్టర్

ప్రతి సోమవారం కలెక్టరేట్లో చేపట్టే ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యథావిధిగా సోమవారం(DEC 22) నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, తమ అర్జీలను కలెక్టరేట్లో సమర్పించి, ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
పాలన వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

పంచాయతీ ఎన్నికలు ముగిసినందున పాలన వ్యవహారాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నిబద్దతతో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో మండల ప్రత్యేక అధికారులుగా కీలకపాత్ర పోషించిన అధికారులకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
News December 22, 2025
పర్యాటక ప్రాంతాల వివరాలు పంపండి: ఖమ్మం కలెక్టర్

అన్ సీన్ పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. నేచర్, వైల్డ్ లైఫ్, హెరిటేజ్, వాటర్ బాడీస్, స్పిరిచువల్, అడ్వెంచర్, ఆర్ట్ అండ్ కల్చర్ వంటి విభాగాల్లోని ప్రదేశాల వివరాలను జనవరి 5లోపు పంపాలని సూచించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.
News December 22, 2025
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


