News February 18, 2025
రేపటి నుంచి శ్రీశైలానికి 24 గంటలూ అనుమతి

NGKL మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల దర్శనానికి వెళ్లే భక్తులకు 24 గంటల అనుమతి ఉందని డీఎఫ్ఓ అబ్దుల్ రావూఫ్ పేర్కొన్నారు. రేపటి నుంచి మార్చి 1 వరకు చెక్ పోస్ట్ 24 గంటలు తెరిచి ఉంటుందన్నారు. గతంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వన్యప్రాణుల సంరక్షణార్థం చెక్ పోస్ట్ మూసి ఉండేదని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, నీటి సీసాలు నిర్దేశించిన ప్రాంతంలో వేయాలని ఆయన ప్రయాణికులకు సూచించారు.
Similar News
News February 22, 2026
భద్రాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో ఆదివారం సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణం కన్నులపండువగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం ఉత్సవ మూర్తులను బేడ మండపానికి తరలించారు. అక్కడ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం నిర్వహించి శాస్త్రోక్తంగా కంకణధారణ గావించారు. వేద మంత్రాల నడుమ జరిగిన ఈ వేడుకను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
News February 22, 2026
SRPT: ఈ నెల 28తో ఫార్మర్ రిజిస్ట్రీ గడువు ముగింపు

జిల్లా వ్యాప్తంగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు గడువు ఈ నెల 28తో ముగియనుంది. రైతులు తప్పనిసరిగా గడువు లోపే నమోదు పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి సూచిస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,02,563 మంది పాస్ పుస్తకాలు కలిగిన రైతుల్లో 1,82,282 మంది మాత్రమే ఇప్పటివరకు నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రీ చేయించుకోని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు దూరమయ్యే అవకాశం ఉంది.
News February 22, 2026
హోం క్లీనింగ్ టిప్స్

* కత్తెర మొద్దుబారినప్పుడు అల్యూమినియం ఫాయిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తే పదునెక్కుతుంది. * మొక్కజొన్న పిండికి కొంచెం నీళ్ళు కలిపి పేస్టు చేసుకొని అద్దాలకు పట్టించి పొడి వస్త్రంతో తుడవాలి. * కంప్యూటర్ కీ బోర్డు, మౌస్ పై మరకలు పడితే వెనిగర్‌లో ముంచిన వస్త్రంతో శుభ్రం చేయాలి. దీనివల్ల సూక్ష్మక్రిములూ నశిస్తాయి. * వెండి వస్తువులను సహజ సిద్ధ గోరింటాకులో నానబెట్టి శుభ్రపరిస్తే తళతళలాడతాయి.


