News December 23, 2025

రేపటి నుంచి సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే సందర్భంగా జనరల్ హాలిడేస్ ప్రకటించారు. అటు ఏపీలో 24, 26న ఆప్షనల్, 25న జనరల్ హాలిడేస్ ఇచ్చారు. జనరల్ హాలిడే రోజు అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. ఆప్షనల్ హాలిడేకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటిస్తాయి.

Similar News

News December 23, 2025

బంగ్లాదేశ్‌లో మైనారిటీల నిరసన గళం

image

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై పెరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. 25 ఏళ్ల హిందూ యువకుడు <<18624742>>దీపూ చంద్రదాస్‌ హత్య<<>> ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలని ఢాకాలో మైనారిటీ వర్గాలు రోడ్డెక్కాయి. మైనారిటీల భద్రతను కాపాడడంలో యూనస్ ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించాయి. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశాయి. మైనారిటీల హక్కులను పరిరక్షించాలని నిరసనకారులు కోరుతున్నారు.

News December 23, 2025

కాంగ్రెస్‌కు మద్దతు తెలిపితే బెదిరిస్తారు: రాహుల్ గాంధీ

image

దేశంలోని సంస్థాగత వ్యవస్థలు BJP గుప్పిట్లో ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జర్మనీలో ఉన్న ఆయన ఓ సభలో మాట్లాడారు. ‘ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ED, CBIలు BJPకి ఆయుధాలుగా మారాయి. ఆ పార్టీ నేతలపై ED, CBI కేసులు లేవు. అదే ఓ వ్యాపారవేత్త కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలనుకుంటే అతడిని బెదిరిస్తారు. BJP, ప్రతిపక్షం వద్ద ఉన్న డబ్బు చూడండి’ అని అన్నారు.

News December 23, 2025

ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం.. సాగుకు సర్కారు ప్రోత్సాహం

image

తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దేశీయ అవసరాల కోసం ఈ పంట సాగుకు ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. కేవలం పామాయిల్‌తోనే కాకుండా దానిలో పసుపు, అల్లం, మిర్చి, మొక్కజొన్న, అరటి, కోకో, మిరియాలు వంటి అంతర పంటలతో అదనపు ఆదాయం పొందొచ్చు. ఈ పంట సాగుకు AP, తెలంగాణ ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.