News February 25, 2026

రేపటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

image

AP: సాలకట్ల తెప్పోత్సవాలకు శ్రీవారి పుష్కరిణి విద్యుత్ కాంతులతో సుందరంగా ముస్తాబైంది. అధికారులు ప్రత్యేక అలంకరణలతో పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. రేపు సాయంత్రం తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నట్లు TTD అధికారులు తెలిపారు. మార్చి 2 వరకు కొనసాగనున్న ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు సహస్రదీపాలంకార సేవ సహా పలు ఆర్జిత సేవలు రద్దయ్యాయి.

Similar News

News February 28, 2026

జిల్లాలో పరిశ్రమల స్థాపన వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల స్థాపన వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. 2025 భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేసుకున్న సంస్థల ప్రాజెక్టులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. కృష్ణ ఆగ్రో ఫ్యూయల్ , మై హోమ్ సిమెంట్స్, ఇండేన్ ఎనర్జీస్
సంస్థల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి, భూసేకరణ అంశాలను సమీక్షించారు.

News February 28, 2026

కొత్త CSగా సాయిప్రసాద్ బాధ్యతలు

image

AP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా జి.సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు తాజా మాజీ సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. సాయి ప్రసాద్ 1991 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి. తొలుత ఉమ్మడి APలో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆపై పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. 2024 నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి‌గా కొనసాగుతున్న ఆయన CSగా ఎంపికయ్యారు.

News February 28, 2026

AI ఫియర్.. ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు!

image

ఏఐ విప్లవం ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నా కొన్ని వృత్తులు మాత్రం అత్యంత సురక్షితమని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ వంటి శారీరక నైపుణ్యం ఉన్నవారిని ఏఐ భర్తీ చేయలేదు. అలాగే డాక్టర్లు, నర్సులు, టీచర్లు, చెఫ్, వ్యవసాయం వంటి వృత్తులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. చేతులతో చేసే పని, మనుషులతో జరిపే సంభాషణ ఉన్నంత కాలం ఈ ఉద్యోగాలకు ఢోకా ఉండదని సూచిస్తున్నారు.