News January 4, 2026
రేపటి నుంచే FA-3 పరీక్షలు: నెల్లూరు DEO

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్ధులకు ఎఫ్ఎ-3 పరీక్షలను సోమవారం నుంచి గురువారం వరకు నిర్వహించాలని డీఈఓ బాలాజీరావు శనివారం తెలిపారు. SERT ఇచ్చిన ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ పంపిణీ చేసిన అసెస్మెంట్ బుక్స్‌లోనే రాయించాలని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు.
Similar News
News January 8, 2026
NLR: వృద్ధాశ్రమాలకు అనుమతులు ఉండాల్సిందే..!

నెల్లూరు జిల్లాలో వృద్ధాశ్రమాల నిర్వహణకు స్వచ్ఛంద సేవా సంస్థలు తప్పనిసరిగా అనుమతులు పొందాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు అహ్మద్ అయూబ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అనుమతులు లేని వయోవృద్ధుల ఆశ్రమాలపై 2007 వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరిన్ని వివరాలకు నెల్లూరులోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News January 8, 2026
కోడి పందేలు జరగకుండా చూడాలి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో కోడిపందేలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో జిల్లా జంతు హింస నివారణ కార్యవర్గ సమావేశం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడి, ఎడ్ల పందేలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు.
News January 8, 2026
నెల్లూరు: బంగారం కోసం హత్య

కొడవలూరు (M) కొత్త వంగల్లు గ్రామంలో ఈనెల 5న ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళ కోటేశ్వరమ్మ హత్యకు గురైంది. నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల వెల్లడించారు. కోటేశ్వరమ్మ ఇంటి వరండాలో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన వేముల రంజిత్ కుమార్ రాయితో కొట్టి హత్య చేశాడు. ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు సరుడు ఎత్తుకెళ్లాడు. నిందితుడిని అరెస్ట్ చేసి సరుడు రికవరీ చేశారు.


