News December 31, 2025

రేపటి నుండి కొత్త రైల్వే టైమ్ టేబుల్….

image

వాల్తేరు డివిజన్ పరిధిలోని పలు కీలక రైళ్ల వేళలను రైల్వే శాఖ సవరించినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026 జనవరి 1 నుంచి కోరమాండల్, హీరాఖండ్ వంటి 11 ప్రధాన రైళ్ల సమయాల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో రాకపోకల వేళలు మారుతాయని, ప్రయాణికులు ఎన్.టి.ఈ.ఎస్ (NTES) యాప్ ద్వారా తాజా సమయాలను సరిచూసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News February 12, 2026

రేపు YCP శాసనసభాపక్ష సమావేశం

image

AP: వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో రేపు ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు MLA, MLCలతో ఆయన భేటీ కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ వారితో చర్చించనున్నట్లు YCP ట్వీట్ చేసింది. ఇవాళ జగన్‌తో పాటు అసెంబ్లీకి వెళ్లిన వైసీపీ సభ్యులు కొంతసేపటికే సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.

News February 12, 2026

పాడేరు: ‘గ్యాప్ ఏరియాకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి’

image

చింతపల్లి, జీకేవీధి మండలాల్లో గ్యాప్ ఏరియాకు సంబంధించిన రెవెన్యూ, ఫారెస్ట్ భూములను తహశీల్దార్లు, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో చింతపల్లి, కొయ్యూరు, జీకేవీధి మండలాల్లో జరుగుతున్న రీసర్వే, మ్యూటేషన్ ప్రక్రియపై సమావేశమై మాట్లాడారు. పెండింగ్లో ఉన్న మ్యూటేషన్లు పూర్తి చేయాలన్నారు.

News February 12, 2026

విజయవాడలో రేపు మెగా జాబ్ మేళా

image

విజయవాడ నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించనున్న జాబ్ మేళా తుమ్మలపల్లి కలక్షత్రంలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. మొత్తం 20 కంపెనీలు పాల్గొంటాయని, విద్యార్హత 10వ తరగతి, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.