News September 21, 2025

రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. 23న సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ఉండటంతో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని, అందుకే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. వచ్చే సోమవారం గ్రీవెన్స్ డే యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు.

Similar News

News September 21, 2025

జీవీఎంసీలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

image

జీవీఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని రేపు రద్దు చేస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. విశాఖలో రెండు రోజులపాటు ఈ గవర్నెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడును ఆ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.

News September 21, 2025

ములుగు: సంప్రదాయ దుస్తులు.. గౌరమ్మ పోలికలు!

image

ములుగు జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మను పేర్చిన ఆడబిడ్డలు బొడ్రాయి, ఆలయాల వద్ద ఆడిపాడుతున్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేస్తున్నారు. చిన్నారులను అందంగా అలంకరించిన తల్లిదండ్రులు ‘గౌరమ్మ పోలిక’ అంటూ సంబరపడుతున్నారు. బతుకమ్మ వేడుకల్లో తీరొక్క పూల బతుకమ్మలతో పాటు పట్టు చీరలు, ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

News September 21, 2025

మెదక్: ‘అమెండ్‌మెంట్ ఉత్తర్వులు ఇప్పించాలి’

image

ఇన్ సర్వీస్ టీచర్స్‌కి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా NCTE నిబంధనలు అమెండ్ మెంట్ ఉత్తర్వులు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి MLC శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు PRTU TS విజ్ఞప్తి చేసినట్లు అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, సర్వీస్ రూల్స్ అమలుపరిచేలా తగిన సహకారం అందించాలన్నారు.