News July 8, 2025

రేపల్లెలో యువకుడి ఆత్మహత్య

image

రేపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. మృతుడు నగరం మండలం ధూళిపూడి గ్రామానికి చెందిన కొండవీటి మణి(25)గా గుర్తించారు. చర్లపల్లి నుంచి రేపల్లె వస్తున్న ట్రైన్(17645) కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమచారం. రేపల్లె రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్, జీఆర్పీఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News July 8, 2025

విమాన లగేజీ రూల్స్‌పై చర్చ.. మీరేమంటారు?

image

విమానంలో ప్రయాణించే వారు తీసుకువెళ్లే లగేజీలపై ఆంక్షలు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే, ఈ రూల్‌పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. 100 కేజీలున్న ఓ వ్యక్తి 24kgల లగేజీని తీసుకెళ్తే ఓకే చెప్తారని, అదే 45kgలున్న మరో వ్యక్తి 26kgల లగేజీ తెస్తే అడ్డు చెప్తారని ఓ యువతి ట్వీట్ చేసింది. ఈ పోస్టుకు 24 గంటల్లోనే 85లక్షల వ్యూస్ లక్ష లైక్స్ వచ్చాయి. యువతి చెప్పిన విషయం కరెక్ట్ అని పలువురు మద్దతు తెలుపుతున్నారు.

News July 8, 2025

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన అచ్చెన్నాయుడు

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో ఆయన కార్యాలయానికి వెళ్లి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఆయనను అచ్చెన్న కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

News July 8, 2025

కారంచేడులో పంచాయతీ పురోగతి సూచిక 2.0 శిక్షణ కార్యక్రమం

image

కారంచేడు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ పురోగతి సూచిక 2.0 ఎఫ్ వై శిక్షణా కార్యక్రమం డీఎల్‌డీ‌ఓ పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు సచివాలయ సిబ్బందికి పంచాయతీల్లో అభివృద్ధి, పారిశుద్ధ్యం తాగునీరు తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో నేతాజీ, డిప్యూటీ ఎంపీడీవో కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.