News August 27, 2025
రేపల్లె ఎక్స్‌ప్రెస్ మళ్లీ పాత షెడ్యూల్‌లోనే

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న వర్క్‌ల కారణంగా కొంతకాలంగా చర్లపల్లి వరకు మాత్రమే నడుస్తున్న రేపల్లె ఎక్స్‌ప్రెస్ మళ్లీ పూర్తి రూట్‌లోనే నడవనుంది. సెప్టెంబర్ 10 నుంచి రైలు(17645) సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12.40కు బయలుదేరి రేపల్లె చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రైలు(17646) రేపల్లె నుంచి బయలుదేరి గుంటూరు మీదుగా సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుతుందని అధికారులు ప్రకటించారు.
Similar News
News August 27, 2025
వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు అలుగులు పొంగుతున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లోని నీరు నిలిచే ప్రాంతాల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News August 27, 2025
వరంగల్: ఆ గ్రామంలో ఒకే గణేశుడు!

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం శివాజీనగర్ గ్రామంలో 350 నుంచి 400 జనాభా ఉంటారు. వినాయక చవితి వచ్చిందంటే ఊరంతా ఒకే మాట.. ఓకే బాటగా నిలుస్తారు. రాజకీయాలకు అతీతంగా, ఐకమత్యంగా వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఒకే వినాయకుడిని ఏర్పాటు చేసుకొని, ఒకే చోట పూజల చేస్తారు. దీంతో గ్రామ ప్రజలను పలువురు అభినందిస్తున్నారు. మీ గ్రామంలో ఎన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారో కామెంట్ చేయండి.
News August 27, 2025
తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు

తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్లే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మధ్య భారీ వర్షాలతో రైల్వే పట్టాలు ధ్వంసం కావడంతో రైలును వరంగల్ నుంచి పెద్దపల్లి, కరీంనగర్, ఆర్మూర్ మీదుగా నిజామాబాద్‌కు మళ్లించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.