News March 1, 2026

రేపల్లె డీఎస్పీ హెచ్చరిక

image

దీపావళి పండుగ నేపథ్యంలో నిల్వ ఉన్న టపాసులు, మందుగుండు సామగ్రిని తక్షణమే ప్రభుత్వ అనుమతి పొందిన గోదాములకు అప్పగించాలని రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు సూచించారు. సబ్ డివిజన్ పరిధిలోని 9 మండలాల ప్రజలు, వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

Similar News

News March 1, 2026

బాధ్యతలు స్వీకరించిన తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ

image

తిరుపతి జిల్లా క్రైమ్ విభాగం అదనపు ఎస్పీగా ఆర్ల శ్రీనివాసులు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సుబ్బరాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. చోరీలు, సైబర్ నేరాలు, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ప్రజల భద్రతకు కట్టుబడి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తానని ఆర్ల శ్రీనివాసులు తెలిపారు.

News March 1, 2026

INDvsWI.. ఒకే ఓవర్లో 24 రన్స్

image

వెస్టిండీస్‌తో మ్యాచులో భారత పేసర్ అర్ష్‌దీప్ ఒకే ఓవర్లో 24 పరుగులు సమర్పించుకున్నారు. ఆయన వేసిన 16వ ఓవర్లో వరుసగా 1, 0, 1, 5WD, 6, WD, 6, 4 వచ్చాయి. విండీస్ బ్యాటర్ పావెల్ చివరి 3 బంతుల్లో వరుసగా 6, 6, 4 బాదారు.

News March 1, 2026

నెల్లూరు GGH ఘటనపై స్పందించిన కలెక్టర్, ఎస్పీ

image

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కలెక్టర్ హిమాన్షు శుక్లా. ఎస్పీ తక్షణమే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని రోగులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని కలెక్టర్ తెలిపారు.