News December 27, 2024
రేపు అంబేడ్కర్ యూనివర్సిటీ సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ శనివారం ఎచ్చర్ల డా.బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి సెలవును ప్రకటిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు వివరాలు వెల్లడించారు. విశ్వవిద్యాలయంతో పాటు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలకు కూడా సంతాప దినంగా శనివారం సెలవును ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 28, 2024
రైతు కుటుంబం ఆత్మహత్యపై అచ్చెన్న ఆరా
కడప జిల్లాలో ఒక రైతు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం ఆరా తీశారు. రైతు కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. రైతు కుటుంబం మృతికి గల కారణాలు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఘటనపై అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News December 28, 2024
శ్రీకాకుళం: విద్యుత్ ధర్నాకు గైర్హాజరైన వైసీపీ ముఖ్య నేతలు
విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ చేపట్టిన పోరుబాటకు ముఖ్య నేతలు గైర్హాజరయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌ల నాయకత్వంలో ధర్నాలు చేపట్టారు. కాగా.. జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమానికి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ ముఖం చాటేశారు. పలువురు నేతలు కూడా గైర్హాజరయ్యారు.
News December 28, 2024
వీరఘట్టం: బాలికలపై లైంగిక దాడులకు పాల్పడింది ఇతనే
విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే ఆ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వీరఘట్టం మండలంలో సంచలనంగా మారింది. తమ పిల్లలపై వికృత చేష్టలకు పాల్పడిన ఆ గురువు తెర్లి సింహాచలంకు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ చిత్రంలో ఉన్న ఆ కామాంధుడు ఇతనే.. ఈ వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.