News August 13, 2025

రేపు అనంతపురానికి YS జగన్

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తాడేపల్లి నుంచి గురువారం ఉదయం 9.45 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఉ.11.30 గంటలకు అనంతపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇంద్రప్రస్థ GMR గ్రౌండ్స్‌కు చేరుకుని, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి కుమారుడి పెళ్లికి హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం బెంగళూరుకు వెళ్తారు.

Similar News

News August 14, 2025

జిల్లాల్లో ఎంత వర్షపాతం నమోదు అయ్యిందంటే?

image

AP: నిన్న కురిసిన భారీ వర్షాలకు అత్యధికంగా బాపట్ల జిల్లా చుండూరు మం.లో 27.24 సెం.మీ., గుంటూరు జిల్లా చేబ్రోలులో 23.4, దుగ్గిరాలలో 22.58, తాడికొండలో 22.50, మంగళగిరిలో 19.48, నాగాయలంకలో 19.1, పెదకాకానిలో 18.68, తుళ్లూరులో 18.02, తెనాలిలో 17.84, కోనసీమ జిల్లా డి.ముమ్మిడివరంలో 18.8, ఏలూరు జిల్లా నిడమర్రులో 14.3, NTR జిల్లా నందిగామలో 13.3, ప.గో.జిల్లా తాడేపల్లిగూడెంలో 11.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

News August 14, 2025

RED ALERT: అత్యంత భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కొనసాగుతున్నాయి. APలోని అల్లూరి, కోనసీమ, ఏలూరు, NTR, GNT, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. TGకి ఇవాళ కూడా RED ALERT జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, KMM, SPT, యాదాద్రి, VKB, సంగారెడ్డి, MDK జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది.

News August 14, 2025

భారత్‌పై ట్రంప్ వైఖరి తప్పు: US Ex NSA

image

భారత్ విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోల్టన్ తప్పుబట్టారు. ‘రష్యా ఆయిల్ కొంటున్నారన్న సాకుతో ఇండియాపై 25%(ఓవరాల్ 50%) అదనపు టారిఫ్స్ వేయడం తప్పు. చైనాకు ఎందుకు అలాంటి సుంకాలు విధించలేదు? ట్రంప్ చర్యలతో అమెరికా మళ్లీ భారత్ నమ్మకాన్ని పొందడం చాలా కష్టం. నా సలహా ఏంటంటే.. భారత్ కూడా పాక్‌లా ట్రంప్‌ని నోబెల్‌ కోసం సిఫార్సు చేయాల్సింది’ అంటూ వ్యాఖ్యానించారు.