News December 14, 2025

రేపు అనకాపల్లి కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం

image

అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మున్సిపల్, మండల కార్యాలయాల్లో ఈ నెల 15వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. స్వయంగా రావడానికి అవకాశం లేనివారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అర్జీలను నమోదు చేసుకోవచ్చనని సూచించారు. అర్జీల పరిస్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు కాల్ చేయాలని పేర్కొన్నారు.

Similar News

News December 18, 2025

క్యాబేజీలో నల్ల కుళ్లు తెగులు లక్షణాలు – నివారణ

image

నల్ల కుళ్లు తెగులు ఆశించి క్యాబేజీ మొక్క ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి వి(V) ఆకారంలో ఉన్న మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారతాయి. ఈ తెగులు నివారణకు 10 లీటర్ల నీటిలో స్ట్రైప్టోసైక్లిన్ 1గ్రా. కలిపి నారు నాటినప్పుడు, గడ్డ తయారైనప్పుడు పైరుపై పిచికారీ చేయాలి. లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు కలిపి ఆ ద్రావణంతో మొక్కల మొదళ్ల చుట్టూ తడపాలి. ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడర్‌ను భూమిలో వేయాలి.

News December 18, 2025

పాపం.. ఆయనకు ఒక్కరే ఓటేశారు!

image

TG: నిన్న మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సందర్భంగా యాదాద్రి(D) అడ్డగూడూర్(M) ధర్మారంలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఒకటో వార్డులో మొత్తం 119 ఓట్లుండగా కప్పల గోపికి 118 ఓట్లు పడ్డాయి. ప్రత్యర్థికి ఒకే ఓటు పడింది. ఇక ఆదిలాబాద్(D) ఉండంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మహేందర్‌ తొలుత 4 ఓట్లతో ఓడిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఆయన రీకౌంటింగ్ కోరగా చివరికి మహేందరే 6 ఓట్లతో గెలుపొందారు.

News December 18, 2025

HYDలో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

image

HYDలో చలి పంజా పుట్టిస్తోంది. నగరంలో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పటాన్‌చెరులో కనిష్ఠంగా 8°C నమోదైంది. HYD రికార్డు స్థాయి అత్యల్ప ఉష్ణోగ్రతని అధికారులు తెలిపారు. కాగా HCU వద్ద 13°C, దుండిగల్‌లో 13°C, హయత్‌నగర్‌లో 14°C నమోదైంది. చిన్న పిల్లలను చలి నుంచి రక్షించాలి. అది వారి ప్రాణానికే ప్రమాదం. అవసరమైతేనే బయటికి రావాలని అనవసరంగా బయట తిరగొద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.